Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘రసమయి’ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్‌ను ప్రారంభించిన సాయి సిల్క్స్ కళామందిర్‌

Sai Silks Kalamandir unveils Rasamayi

ఐవీఆర్

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (20:36 IST)
తమ బ్రాండ్ ఈక్విటీ పైన మరింతగా ఆధారపడుతూ, ఎథ్నిక్ అపెరల్ రిటైలర్ సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్, భారతదేశంలోని వెండి ఆభరణాల మార్కెట్‌లోకి ప్రవేశించడంతో తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇది విశాఖపట్నంలోని ప్రస్తుత కళామందిర్ స్టోర్‌లో "రసమయి" బ్రాండ్‌తో తమ మొదటి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ రిటైల్ అవుట్‌లెట్‌ను తెరిచింది. ఫ్యాషన్ పరిశ్రమలో దశాబ్దాల తరబడి ఉన్న తమ మహోన్నత వారసత్వంపై ఆధారపడి, ఫైన్ సిల్వర్ జ్యువెలరీలో విభాగంలోకి ప్రవేశించాలనే నిర్ణయం SSKLకి సహజమైన పురోగతిగా వచ్చింది. ఈ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ నక్షి ఆభరణాలు, CZ జ్యువెలరీ, విక్టోరియన్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, మొయిసానైట్ జ్యువెలరీ, అల్ట్రా ప్రీమియం లైట్ వెయిట్ జ్యువెలరీ ఉన్నాయి.
 
సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ,“ఎథ్నిక్ వేర్‌లో నాణ్యమైన పనితనం, కాలాతీత గాంభీర్యంకు మేము ప్రతిరూపంగా ఉన్నాము. వెండి ఆభరణాల రంగంలోకి మా వ్యూహాత్మక విస్తరణతో, ఆకర్షణ, వారసత్వం, అధునాతనతను వెదజల్లే విలక్షణమైన పీస్‌లను కోరుకునే చక్కటి ఆభరణాల ప్రేమికుల అవసరాలను మేము తీరుస్తాము. మా విలువలతో ప్రతిధ్వనించే, ఆభరణాలు, ఫ్యాషన్, అందాన్ని మెచ్చుకునే కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మేము సంతోషిస్తున్నాము. నేడు, ఆభరణాలనేవి ఇక ఎంతమాత్రమూ ఒక ప్రత్యేక వస్తువు కాదు. కానీ, ఫ్యాషన్ కోసం ఒక అనివార్యమైన అనుబంధం. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో, ఈ చీర-ఆభరణాల కాంబో ఆఫరింగ్ మా అభిమానులకు మెరుగైన షాపింగ్ అనుభవాలను అందిస్తుంది. సమకాలీన వైభవంతో సంప్రదాయాన్ని మిళితం చేసే ప్రీమియం వెండి యాక్ససరీల యొక్క అద్భుతమైన కలెక్షన్‌ను అన్వేషించడానికి కస్టమర్‌లు ఎదురుచూడవచ్చు" అని అన్నారు.
 
SSKL డైరెక్టర్స్‌తో పాటు ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న SSKL అల్ట్రా-ప్రీమియం, ప్రీమియం చీరలు, లెహంగాలు, పురుషులు, పిల్లల ఎథ్నిక్ వస్త్రాలతో సహా అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది. బంగారు ఆభరణాలపై ప్రేమకు పేరుగాంచిన భారతదేశంలో, గత సంవత్సర కాలంలో వెండి ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని వరల్డ్ సిల్వర్ సర్వే వెల్లడిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొటాషియం తగ్గితే ఏమవుతుంది? అది లభించే పదార్థాలు ఏమిటి?