Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

అతిపెద్ద ఎథ్నిక్ వేర్ సేల్‌, అవాంత్రా బై ట్రెండ్స్‌లో 50% వరకు రాయితీతో అమ్మ‌కాలు

Advertiesment
avantra
, బుధవారం, 6 జులై 2022 (16:05 IST)
‘అవాంత్రా బై ట్రెండ్స్’ అనేది మహిళల కోసం ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మక ఎథ్నిక్ వేర్ డెస్టినేషన్ స్టోర్. ఇందులో 2022 జూన్ 24 నుంచి 2022 జూలై 31 వరకు 50% వరకు తగ్గింపుతో అతిపెద్ద ఎథ్నిక్ వేర్ సేల్ వస్తోంది. సాంప్రదాయం, సంస్కృతి, వారసత్వానికి విలువనిచ్చి, "భారతీయ", "జాతి"కి సంబంధించిన అన్నింటినీ ఆనందంగా జరుపుకొనే సమకాలీన భారతీయ మహిళల‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స‌రికొత్త భావన 'అవాంత్రా బై ట్రెండ్స్'.

 
మచ్చలేని స్టోర్ వాతావరణం, అసిస్టెడ్ సర్వీస్, సెల్ఫ్ సర్వీస్, శారీ డ్రేప్ స్టైలింగ్ స్టేషన్, నాన్ షాపర్ లాంజ్, కాంప్లిమెంటేటింగ్ ప్రొడక్ట్ కేటగిరీలు, బ్లౌజ్ స్టిచింగ్, శారీ ఫినిషింగ్, రెడీమేడ్ చీరలు, పికో మరియు ఫాల్ స్టిచింగ్.. ఇంకా మరెన్నో సంపూర్ణ టైలరింగ్ సేవ‌ల ద్వారా సమకాలీన భారతీయ మహిళల షాపింగ్ అనుభవాన్ని ఈ స్టోర్ పునర్నిర్వచించింది.

 
విభిన్న రంగుల‌తో కూడిన వస్త్ర కళలు, భారతదేశపు అత్యుత్తమ పట్టు, అత్యుత్తమ ఫ్యాషన్, నాణ్యత, ధరల సమగ్రతకు నిబద్ధతతో అత్యుత్తమ జాతి-వేర్ బ్రాండ్లకు నిలయంగా, “అవంత్రా బై ట్రెండ్స్” ఉంది. ఇది ఒక సంపూర్ణ ప్రయోగాత్మక దుకాణం. సిల్క్ నుంచి సింథటిక్స్ వరకు అన్నిర‌కాల చీరలు ఉండే విస్తృత శ్రేణి అనుబంధ ఉత్పత్తి కేటగిరీలతో మహిళల దుస్తులు స‌మ‌స్తం ఇక్క‌డే దొరుకుతాయి. ఈ స్టోర్ బ్లౌజులు, ఇండియన్ వేర్, జ్యువెలరీ, ఫుట్ వేర్, యాక్ససరీలు, సౌకర్యవంతమైన ఇన్ స్టోర్ టైలరింగ్ సేవ‌లను అందిస్తుంది. చీరలు, లెహంగాలు, బ్లౌజులు, కుర్తాలు, యాక్ససరీలు, ఆభరణాలు, పాదరక్షలు, హ్యాండ్ బ్యాగులు.. ఇవ‌న్నీ రాయితీతో కూడిన అమ్మ‌కాల్లో ల‌భ్య‌మ‌వుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మామిడి టెంకలో గింజ ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?