Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈసారి రఘురామకృష్ణరాజుపై వేటు ఖాయమేనా?

Advertiesment
ఈసారి రఘురామకృష్ణరాజుపై వేటు ఖాయమేనా?
, బుధవారం, 18 ఆగస్టు 2021 (22:14 IST)
రాష్ట్రప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొద్దినెలల పాటు స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ ఎంపి రఘురామక్రిష్ణమరాజు తిరుగుబావుటా ఎగురవేశారు. ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. అనంతరం ఈ పరిణామాల తరువాత ఆయన సుప్రీంకోర్టులో ఊరట లభించడం ఆయన మరోసారి వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

సొంత పార్టీలోనే ఎంపి తిరుగుబావుటా ఎగురవేయడంపై ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. మోడీని కాదని స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటివరకు రాసుపూసుకుని తిరుగుతున్న బిజెపికి వైసిపి రఘురామక్రిష్ణమరాజుపై చర్యలు ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాలి. 
 
రఘురామక్రిష్ణమరాజు తమ పార్టీపై లేనిపోని నిందలు మోపుతున్నారని వైసిపి ఎంపిలు ఇప్పటికే మోడీ దగ్గర మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ ఆయనపైన చర్యలు తీసుకోమని వైసిపి ఎంపిలు అనర్హత వేటు వేయాలని చెప్పినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అనర్హత వేటుపై ఎంత ప్రయత్నిస్తున్నా సక్సెస్ కాలేకపోయారు. అనర్హత వేటు వేయించడంలో లోక్ సభ స్పీకర్‌కు పెద్ద విషయమేమీ కాదు. అయితే క్లియరెన్స్ కోసం ఆయన వేచి చూసే పరిస్థితి. 
 
ఇది కాకపోవడంతో ఎంపిలు పార్టీ ఫిరాయింపుల విషయంలో ఒక రాజ్యాంగ సవరణ చేయాలని విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజోకు ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఓం బిర్లాకు కాని పని కిరణ్ దగ్గర ఎలా అవుతుందో తెలియదు..? కేంద్రస్థాయిలో ఏం జరగాలన్నా మోడీ తలుచుకుంటేనే జరుగుతుంది. జగన్‌కు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. జగన్ బెయిల్ రద్దుచేయాలని.. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని ఆయనన పిటిషన్లు కూడా వేశారు.
 
ఇద్దరి మధ్య రోజురోజుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది. రఘురామక్రిష్ణమరాజుకు బిజెపి సహకారం లేనిదే రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామక్రిష్ణమరాజును వాడుకుంటున్నారా అనేది కూడా ఒక అనుమానమే. అనర్హత వేటు వేసేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారు. లోక్ సభ స్పీకర్ తిరుమల రెండురోజుల పర్యటనలో విజయసాయిరెడ్డి రావడం.. ఎంపిలు ఆయనతో పాటే ఉండడం.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ బాటలో తాలిబన్లపై యూట్యూబ్‌, వాట్సాప్‌ నిషేధం