వైసీపీ ప్రభుత్వం ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని పలు సన్నహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అనేకమంది తెలుగు భాషాభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు రాత పూర్వక వ్యతిరేకతను తెలిపారు. కొందరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేమని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని కోరారు. కరోనా తగ్గిన తర్వాతే పాఠశాలలను ప్రారంభించాలని తెలిపారు. ఈ విషయంలో జగన్ తన ఆవేశాన్ని తగ్గించి ఆలోచన చేయాలని తెలిపారు.
మరోవైపు ఏపీ విద్యాశాఖ మంత్రికి రఘురామ లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియంపై సుప్రీంకోర్టులో కచ్చితంగా వ్యతిరేకత వస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టులో స్టే రాకపోతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని తెలిపారు. ఏ మీడియంలో విద్యాబోధన ప్రారంభించబోతారో ముందుగా చెప్పాలని తెలిపారు.