Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మో అణుయుద్ధం: భారత్-పాక్ మధ్య వస్తే 10 కోట్లమంది మృతి... ఆ తర్వాత?

Advertiesment
అమ్మో అణుయుద్ధం: భారత్-పాక్ మధ్య వస్తే 10 కోట్లమంది మృతి... ఆ తర్వాత?
, గురువారం, 3 అక్టోబరు 2019 (15:11 IST)
అణు యుద్ధం గురించి ఇటీవలి కాలంలో పదేపదే పాకిస్తాన్ దేశం ప్రస్తావిస్తోంది. కశ్మీర్ అంశంపై ఆ దేశం విషం కక్కుతోంది. మరోవైపు పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదుల పంజా ప్రభావం ఎక్కువగా వుంటుందనేది నిర్వివాదాంశం. పిచ్చివాడి చేతిలో రాయి వున్నట్లు... ఇపుడు పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. 
 
ఒకవేళ భారత్-పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది? దీనిపై అలాన్ రోబాక్ భయంకరమైన విషయాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం. భారతదేశం-పాకిస్తాన్ అణు యుద్ధానికి పాల్పడితే, అప్పటికప్పుడు 10 కోట్ల మంది మరణించే అవకాశం వుంది. ఆ తరువాత ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రభావం కారణంగా సామూహిక ఆకలితో చనిపోయేవారి సంఖ్య కూడా అధికమవుతుంది. 
 
ఎందుకంటే అణుయుద్ధం మిగిల్చే ఫలితాలు చాలా భయంకరంగా వుంటాయి. తినేందుకు ఏమీ దొరకని పరిస్థితి తలెత్తుతుంది. పంటలు పండవు. వృక్షాలు సర్వనాశనమవుతాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారి పడిపోతాయి. ప్రకృతి ఉత్పాతాలు తలెత్తుతాయి. పూర్తిగా అణుయుద్ధం జరిగిన ప్రాంతం నాశనమవుతుంది. బాంబులు పడిన చోట పూర్తిగా నాశమైతే... మిగిలిన ప్రాంతాలు క్రమేణా ఆ ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుంది. 
 
"ఇటువంటి యుద్ధం బాంబులను లక్ష్యంగా చేసుకునే ప్రదేశాలను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్నే వణికిస్తుంది " అని యుఎస్ లోని రట్జర్స్ విశ్వవిద్యాలయం- న్యూ బ్రున్స్విక్ సహ రచయిత అలాన్ రోబాక్ అన్నారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, 2025లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య సంభవించే ఒక యుద్ధ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.
 
రెండు పొరుగు దేశాలు కాశ్మీర్‌పై అనేక యుద్ధాలు చేసినప్పటికీ, అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వుంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు 2025 నాటికి కనీసం 400 నుండి 500 అణు బాంబులను కలిగి వుండే అవకాశం వున్నట్లు ఆ అధ్యయనం పేర్కొంది.
webdunia
 
అణు బాంబులు ప్రయోగిస్తే వాటి నుంచి 16 నుండి 36 మిలియన్ టన్నుల మసి, పొగలోని చిన్న నల్ల కార్బన్ కణాలను విడుదల చేస్తాయి. ఇవి ఎగువ వాతావరణానికి వ్యాప్తి చెందుతాయి. కొన్ని వారాలలోనే అవన్నీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా సౌర వికిరణం జరుగుతుంది. గాలిని వేడి చేస్తుంది. పొగ వేగవంతంగా కదులుతుంది.
 
ఈ ప్రక్రియలో, భూమికి చేరే సూర్యకాంతి 20 నుండి 35 శాతం మేర తగ్గిపోతుంది. దీనివల్ల మన భూగ్రహం యొక్క ఉపరితలం 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం 15 నుండి 30 శాతం వరకు తగ్గిపోతుంది. భూమిపై వృక్షసంపద వృద్ధి ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 30 శాతం పడిపోతుంది. మహాసముద్రాలు ఉత్పాదకత 5 నుంచి 15 శాతం తగ్గుతాయి.
 
మొత్తంమీద, ఈ ప్రభావాల నుండి కోలుకోవడానికి పదేళ్ళకు పైగా పడుతుందని అధ్యయనం పేర్కొంది. "తొమ్మిది దేశాలలో అణ్వాయుధాలు ఉన్నాయి, కానీ పాకిస్తాన్ - భారతదేశం మాత్రమే తమ ఆయుధాలను అత్యంత వేగంగా పెంచుకుంటూ పోతున్నాయి" అని రోబాక్ చెప్పారు. 
 
రెండు అణ్వాయుధ దేశాల మధ్య, ముఖ్యంగా కాశ్మీర్‌పై కొనసాగుతున్న అశాంతి, అణు యుద్ధం యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 2025 సంవత్సరంలో అణ్వాయుధాలు 15 కిలోటన్ల మేర పేలుడు శక్తితో ఉండవచ్చు. ఇది 1945లో హిరోషిమాపై బాంబు పడిన ప్రాంతం కేవలం కొన్ని వందల కిలోటన్స్ మాత్రమే. ఈ నేపధ్యంలో, 2025లో అణు యుద్ధం సంభవిస్తే కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా సామూహిక ఆకలితో అదనపు మరణాలు కూడా సంభవిస్తాయి.
 
"అణ్వాయుధాలను ఏ హేతుబద్ధమైన దృష్టాంతంలోనూ ఉపయోగించరాదు కాని ప్రమాదవశాత్తు లేదా హ్యాకింగ్, భయాందోళనలు లేదంటే అయోమయంలో కూరుకుపోయిన ప్రపంచ నాయకుల ఫలితంగా వీటిని ఉపయోగించే అవకాశం వుంది" అని రోబాక్ చెప్పారు.

రోబాక్ ప్రకారం, అణ్వాయుధాలను ప్రమాదవశాత్తు ఉపయోగించే అవకాశం వున్న నేపధ్యంలో వాటిని నిరోధించడం ఒక్కటే ఏకైక మార్గం... అంటే వాటిని పూర్తిగా తొలగించడమే. మరి భారత్-పాక్ దేశాలు పెంచుకుంటూ పోతున్న అణ్వాయుధాలను ఏం చేస్తాయో చూడాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా రోడ్డు చూడండి మహాప్రభో- గాడిదపై ఊరేగుతూ(Video)