Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిత్ శర్మ సిక్సుల మోత.. టెస్టుల్లో ఓపెనర్‌‌గా శతక్కొట్టాడు..

రోహిత్ శర్మ సిక్సుల మోత.. టెస్టుల్లో ఓపెనర్‌‌గా శతక్కొట్టాడు..
, బుధవారం, 2 అక్టోబరు 2019 (16:34 IST)
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టేస్తున్నారు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అలా దిగాడో లేదో.. అర్ధ సెంచరీతో అదరగొట్టేశాడు.

టెస్టుల్లోనూ చూడచక్కని సిక్సులతో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 84 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఆపై సెంచరీని సాధించాడు. మొత్తం 154 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు , 4 సిక్సర్ల సాయంతో శతకం కొట్టాడు.
 
వన్డేల్లో ఉతికిపారేసే రోహిత్ శర్మ..  టెస్టుల్లోనూ మెరిశాడు. సిక్సుల మోత మోగించాడు.  వన్డేల తరహాలో సెంచరీలతో దూకుడు ప్రదర్శించాడు.  వన్డేల్లోనూ మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన రోహిత్.. బాగానే ఆడేవాడు. అయితే, ధోని అతడ్ని ఓపెనర్‌‌గా అవకాశం ఇవ్వడంతో కొత్త చరిత్రలు తిరగరాస్తున్నాడు. ఇప్పుడు టెస్టుల్లోనూ ఓపెనర్ అవతారం ఎత్తాడు.. రోహిత్ శర్మ.
 
కాగా... వైజాగ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతున్న వేళ వర్షం కురవడంతో పాటు వెలుతురులేమి కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 115 పరుగులు, మయాంక్ అగర్వాల్ 84 పరుగులతో అజేయంగా ఉన్నారు. రోజంతా శ్రమించినా సఫారీ బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎస్‌కే జట్టంటే అహస్యం.. కారణం ఏమిటో తెలుసా?: శ్రీశాంత్