Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహితను లొంగదీసుకున్న యువకుడు, పెళ్లాడమంటే వీడియోలు బయటపెట్టాడు

Advertiesment
వివాహితను లొంగదీసుకున్న యువకుడు, పెళ్లాడమంటే వీడియోలు బయటపెట్టాడు
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (11:42 IST)
భర్త కంటే ప్రియుడినే ఎక్కువగా నమ్మింది. మూడేళ్ల కొడుకు ఉన్నా సరే ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుంది. భర్తను మించి ప్రియుడే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నాడని ఆమె భావించింది. ప్రియుడితో మూడునెలల పాటు శారీరకంగా కలిసింది. ఇంటి నుంచి తీసుకెళ్ళి పెళ్ళి చేసుకుంటాడని గాఢంగా నమ్మింది. కానీ చివరకు ప్రియుడే తనను మోసం చేస్తాడని ఊహించలేకపోయింది.

 
కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా వెల్లరాడలో నివాసముంటున్న ఫెర్లిన్ ఫిలిప్, గోపికలకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. భర్త ఎప్పుడూ పనుల నిమిత్తం బయటకు వెళ్ళేవాడు. ఒకసారి బయటకు వెళితే మూడురోజుల పాటు వచ్చేవాడు కాదు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానన్న ఫీలింగ్ ఆమెలో నెలకొంది.

 
ఈ క్రమంలో విష్ణు అనే ఆటో డ్రైవర్ పరిచమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను ప్రేమిస్తున్నానంటూ వివాహిత వెంట పడ్డాడు. ఐదునెలల నుంచి విష్ణు వెంటపడుతూనే వున్నాడు. మొదట్లో అతడిని దూరం పెట్టినప్పటికీ క్రమంగా అతడిని బాగా నమ్మింది గోపిక. 

 
ఆ నమ్మకం కాస్తా శారీరకంగా కలవడానికి కారణమైంది. మూడు నెలల పాటు భర్తకు ఎలాంటి అనుమానం రాకుండా విష్ణుతో కలిసింది ఆమె. తనను పెళ్ళి చేసుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళమని చెప్పింది. తన కొడుకుని భర్త దగ్గరే వదిలి వచ్చేస్తానని కూడా చెప్పింది.

 
అయితే విష్ణు కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే తనను వాడుకున్నాడని ఆ తరువాత తెలుసుకుంది. పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదు... నేను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానన్నాడు. దీంతో ఏడ్చి గగ్గోలు పెట్టింది గోపిక. 

 
పెళ్ళిచేసుకొని తీరాలని గట్టిగా పట్టుబట్టింది. దీంతో విష్ణు గోపికతో ఏకాంతంగా ఉన్న వీడియోలను ఏకంగా ఆమె భర్తకే పంపించాడు. దీన్ని చూసిన భర్త ప్రశ్నించగా ఆవేదనకు గురైన గోపిక తన భర్త ఇంట్లో లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు గల కారణాలు ఒక లేఖలో రాసి ఉంచింది గోపిక. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరి నదుల అనుసంధానం : నిర్మలమ్మ