ఇటీవలి కాలంలో భర్తలను ఓ పథకం ప్రకారం హత్య చేస్తున్న భార్యల కేసులు పెరుగుతున్నాయి. ఆమధ్య మేఘాలయలో ఇండోర్ నగరానికి చెందిన ఓ వివాహిత భర్తను హత్య చేయించి ఏమీ ఎరగనట్లు నటించింది. ఆ తర్వాత అసలు విషయం బైటపడింది. తాజాగా ఇటువంటి ఘటనే కర్నాటక-తెలంగాణ సరిహద్ద ప్రాంతంలో కృష్ణా నది వద్ద జరిగింది.
పూర్తి వివరాలు చూస్తే... తన భర్తను నది వద్ద సెల్ఫీ దిగుదామంటూ పిలుచుకుని వెళ్లింది ఓ భార్య. అతడు కాస్త దూరంగా నిలబడి చూస్తుండగా, వంతెనపై నుంచి సెల్ఫీ దిగుదామంటూ పిలుచుకుని వెళ్లింది. అలా సెల్ఫీ దిగుతుండగా భర్తను అమాంతం ప్రవహిస్తున్న కృష్ణా నదిలోకి తోసేసింది. అతడు మునిగిపోతాడేమోనని చూస్తూ వున్న మహిళకు చేదు గుళిక అడ్డం పడింది.
నదిలో ఓ బండరాయిని ఆసరాగా చేసుకుని సదరు వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుని పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దాంతో ఇక అతడు చనిపోయే అవకాశం లేదని గ్రహించిన మహిళ.. తన భర్తను కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. అది గమనించిన స్థానికులు అతడిని తాడు సాయంతో బైటకు లాగి కాపాడారు. బైటకు వచ్చిన భర్త.. తనను సెల్ఫీ పేరుతో చంపేద్దామని ప్లాన్ చేసావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇదే విషయాన్ని ఫోనులో తన కుటుంబ సభ్యులకు తెలియజేసాడు.