Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ... భర్తను చున్నీతో చంపేసిన భార్య .. ఎక్కడ?

Advertiesment
murder
శ్రీకాకుళం జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య చంపేసింది. భర్త మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవపడ్డాడు. దీంతో చున్నీని భర్త మెడకు చుట్టి బిగించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీమిలి మండలం, తగరపు వలస పరిధిలోని వలందపేట గ్రామానికి చెందిన తాపీమేస్త్రి బోర సూరిబాబు అలియాస్‌ తాత (28)కి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగమణి (26)తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. 
 
ఆమె స్థానికంగా ఉన్న ఓ న్యూడిల్స్‌ దుకాణంలో పని చేస్తోంది. భార్యపై అనుమానం, తాగేసి ఇంటికి రావడంతో వీరిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగేవి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా వీరికి సంతానం లేదు. ఈ క్రమంలో ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె ఇటీవల పెద్దల రాజీతో భర్త వద్దకు వచ్చింది.
 
ఆదివారం సాయంత్రం బాగా తాగివచ్చిన భర్తతో గొడవపడి ఆవేశంలో చున్నీతో గొంతు బిగించి ఊపిరి తీసింది. అనంతరం ఏదో తాగేసి పడిపోయి లేవడం లేదంటూ ఇరుగుపొరుగు వారిని నమ్మించింది. ఆపై సంగివలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అయితే, ఇది ఆత్మహత్య కాదు భార్యే చంపేసిందని మృతుడి కుటుంబీకులు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయగా నేరం అంగీకరించడంతో నిందితురాలిని నగరంలోని హోమ్‌కు తరలించారు. భీమిలి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పంచనామా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంతి రేఖలా ఇండియా పాకిస్థాన్ సరిహద్దు.. వీడియోను షేర్ చేసిన ఇండిగో పైలెట్ (వీడియో)