Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రిని కోల్పోయిన బాలికపై ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం...

Advertiesment
victim
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (14:08 IST)
తండ్రిని కోల్పోయిన బాలికను చేరదీస్తానంటూ ఇంటికి తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చడంతో మాత్రలు తెచ్చి ఇంట్లోనే గర్భస్రావం చేయించాడు. దీనికి అతని భార్య కూడా పూర్తిగా సహకరించింది. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. ఈ బాలిక తన స్నేహితుడి కుమార్తె కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత బాలిక గత యేడాది తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2020-21 మధ్య కాలంలో పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. 
 
ఈ విషయాన్ని అతడు తన భార్యకు చెప్పడంతో ఆమె తన కుమారుడితో మందులు తెప్పించి ఇంట్లోనే గర్భస్రావం చేయించింది. ఆ తర్వాత కూడా ఆ కామాంధుడి ఆగడాలు మరింతగా పెరిగిపోవడంతో వాటిని తట్టుకోలేక ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కామాధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును కలిసి యార్లగడ్డ వెంకట్రావు.. ఎక్కడ నుంచైనా పోటీ చేస్తా!!