Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబును కలిసి యార్లగడ్డ వెంకట్రావు.. ఎక్కడ నుంచైనా పోటీ చేస్తా!!

Advertiesment
cbn - yarlagadda
, ఆదివారం, 20 ఆగస్టు 2023 (13:22 IST)
వైకాపాకు చెందిన మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు కలిశారు. వైకాపాను వీడి తెదేపాలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన యార్లగడ్డ.. ఆదివారం చంద్రబాబును కలిశారు. 
 
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 19 ఏళ్లు అమెరికాలో ఉన్నప్పటి సంగతులు.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో స్వదేశానికి రావడం తదితర విషయాలను చంద్రబాబుకు వివరించినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారన్నారు. త్వరలోనే తెదేపాలో చేరుతానని తెలిపారు.
 
ప్రజాప్రతినిధిగా ఉంటే తప్ప రాజకీయాల్లో మనుగడ సాధించలేమని భావించి వైకాపాలో చేరి గన్నవరంలో ఆ పార్టీ తరపున పోటీ చేశానని వివరించారు. తెదేపాలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైకాపాకు మద్దతు తెలపడంతో తనను పక్కన పెట్టారని.. దీంతో గత మూడున్నర సంవత్సరాలుగా తాను పడుతున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించానని చెప్పారు. 
 
ఉమ్మడి ఏపీలో అతి చిన్నవయసులోనే సీఎం అయిన రెండో వ్యక్తి చంద్రబాబు అని.. రాష్ట్ర ప్రయోజనాలపైనే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారనేది ఏ పార్టీ వారైనా అంగీకరించాల్సిన నిజమని వ్యాఖ్యానించారు. తెదేపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నందున.. ఇకపై పార్టీ ఏం చెబితే అది చేస్తానన్నారు. 
 
గన్నవరం తెదేపా టికెట్‌పై హామీ లభించిందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ సమాధానమిచ్చారు. పార్టీ ఆదేశిస్తే గుడివాడ నుంచైనా పోటీ చేస్తానన్నారు. అయితే, తాను పార్టీ టిక్కెట్ ఆశించి టీడీపీలో చేరడం లేదని, ఏపీ రాష్ట్ర భవిష్యత్ బాగుండాలనే ఆ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్‌లో ఘోరం... డీజిల్ డ్రమ్ములు పగిలి 18 మంది సజీవదహనం