Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అసహజ సృంగారనికి భార్యపై తెలంగాణ ఐఏఎస్ అధికారి ఒత్తిడి.. ఫిర్యాదు..

Advertiesment
victim
, ఆదివారం, 11 జూన్ 2023 (09:15 IST)
తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఒకరు చిక్కుల్లో పడ్డారు. గత 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపైపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అసహజ శృంగారానికి ఒత్తిడి చేస్తున్నారని, వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎఫ్ఐర్‌ నమోదు చేయాలని ఛత్తీస్‌గఢ్ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
 
కట్నం కోసం తనను వేధిస్తున్నారంటూ ఆయన భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశించింది. గృహహింసతో పాటు అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త వ్యవహరశైలిపై కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 
 
ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఐఏఎస్పై ఎఫ్ఎస్ఐఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. సందీప్ కుమార్ స్వస్థలం బిహార్ లోని దర్భంగా జిల్లా. ఆయనకు 2021లో కోర్బా ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. 
 
రూ.కోటికి పైగా ఖర్చుచేసి పెళ్లి జరిపించినా.. పెద్దఎత్తున బంగారం, ఆభరణాలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. పెళ్లికి ముందు, తర్వాత కట్నం కోసం ఆయన హింసించారన్నారు. సందీప్ కుమార్ ఝా ప్రస్తుతం తెలంగాణ ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసాధారణ తీవ్ర తుఫాను - వచ్చే 12 గంటల్లో అతితీవ్ర రూపం