అనుకున్నది ఒకటి. జరుగుతున్నది ఒకటి. మనమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ, ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. భవిష్యత్తు ఫెయిల్ అయింది. నేను వెళ్ళిపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మనం ఒక దగ్గర ఉండలేం. ఇదే నా చివరి సంక్షిప్త సమాచారం. సారీ, మై బాయ్ అంటూ ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సందేశాన్ని తన వాట్సాప్ సందేశంగా పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట ఠాణాలో పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు.. అల్మాస్ గూడ ఎస్ఎస్ రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న అశోక్, రూపల కుమార్తె విహారిక (20), అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కాలేజీలో బీటెక్ విద్యాభ్యాసం చేస్తోంది. అల్మాస్ గూడ రాజీవ్ గృహకల్పకు చెందిన డెరకేషన్ పని చేసే కిషోర్‌తో గత ఆరు నెలలుగా ప్రేమలో పడింది.
అయితే, ఆదివారం అర్థరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూసిన విహారిక నిద్రించేందుకు పడక గదిలోకి వెళ్లింది. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. చనిపోయే ముందు ఫోనులోవాట్సాప్ స్టేటస్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.
వారి ప్రేమను అంగీరించినప్పటికీ అతడి ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసిందని, అయినప్పటికీ పెళ్లి చేసుకోవాలని, మాట్లాడాలని అతడు వేధించడంతో పాటు తమను కూడా బెదిరించాడని యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.