Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళను చెరబట్టి అత్యాచారం చేసిన ఎస్ఐ - సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Advertiesment
victim
, ఆదివారం, 10 జులై 2022 (12:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళను ఓ ఎస్ఐ చెరబట్టి, తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కామాంధుడైన ఎస్‌ఐను పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్ర రాజధానిలో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ ఘటన మరవకుముందే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ విజయ్‌పై మహిళ ఫిర్యాదు చేశారు. 
 
పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఎస్‌ఐపై యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శాఖాపరమైన విచారణ ప్రారంభించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ విజయ్‌ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంలో పని చేయని రాడార్లు