Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసిన కిరాతక భర్త

Advertiesment
swathi

ఠాగూర్

, ఆదివారం, 24 ఆగస్టు 2025 (16:35 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేశాడో కసాయి భర్త. ఈ దారుణం వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడెంకు చెందిన స్వాతి (25) అనే మహిళతో మహేందర్ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్యను హతమార్చి, అనంతరం శరీర భాగాలను కవర్‌లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్ళి పడేసేందుకు సిద్ధమయ్యాడు. 
 
అయితే, గది నుంచి శబ్దం రావడంతో పక్కింటి వ్యక్తులు వచ్చి చూడగా మహేందర్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. కవర్‌లో ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు  సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. నిందితుడు మహేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో స్వాతి కాళ్లు  చేతులు, తల వేరు చేసి మూసీ నదిలో పడేసినట్టు చెప్పాడు. వాటి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంటిలో కవర్‌లో ఉన్న ఛాతి భాగాన్ని మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలులో నిద్రిస్తున్న మహిళను అసభ్యంగా తాకిన కానిస్టేబుల్