Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యం మత్తు.. భార్య ఇంటి వదిలి వెళ్లిపోయింది.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

Advertiesment
Crime

సెల్వి

, శనివారం, 25 అక్టోబరు 2025 (23:37 IST)
కన్నకూతురిపైనే ఓ తండ్రి కొన్ని రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌‌కు చెందిన నిందితుడు మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 
 
దీంతో ఏడవ తరగతి చదువుతున్న 14ఏళ్ల పెద్దమ్మాయి తండ్రితో వుంటుంది. ప్రతిరోజూ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చే నిందితుడు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడేవాడు. రెండు నెలల పాటు తనపై జరుగుతున్న అకృత్యాన్ని భరించలేక పక్కింటి వృద్ధురాలికి బాధితురాలు తెలిపింది. 
 
ఆమె వెంటనే బాలికను వైద్యుని వద్దకు తీసుకెళ్లింది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్, బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. ఆపై బాలికపై జరిగిన నేరాన్ని బహిర్గతం చేసింది. 
 
ఇంకా ఆ వృద్ధురాలు పోలీసులకు సమాచారం అందించింది. భూపాని పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Divya Suresh: కన్నడ నటి దివ్య సురేష్‌పై హిట్ అండ్ రన్ కేసు నమోదు