తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. మహిళా కానిస్టేబుల్ శృతికి, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే నిఖిల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఈ ముగ్గురు అడ్లూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మూడు మృతదేహాలను గుజ ఈతగాళ్లు గురువారం వెలికి తీశారు.
కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ సాయికుమార్ వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. ఎస్సైకి, కానిస్టేబుల్ శృతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎస్ఐ సాయికుమార్‌కు పెళ్లయి ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. కాగా, శృతికి పెళ్లయి విడాకులు అయినట్లు తెలుస్తోంది.