Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీ మహిళా అభ్యర్థిని ఆలింగనం చేసుకుని సస్పెండైన ఏఎస్ఐ

Advertiesment
asi hugging

వరుణ్

, మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (08:45 IST)
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా విరించి ఆస్పత్రి యజమాని భార్య మాధవీలత పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచారసమయంలో భద్రతా విధుల్లో ఉన్న ఒక ఏఎస్ఐ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీస్ కమిషనర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఆమె పేరు ఉమాదేవి. సైదాపబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 
 
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలత తన నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో సైదాబాద్‌ ఏఎస్ఐ ఉమాదేవి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీడియో ఉన్నదాని ప్రకారం ఏఎస్ఐ మాధవీలతకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత హగ్ చేసుకున్నారు. కాగా ఈ స్థానం నుంచి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా?