Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభంశుభం తెలియని 12 యేళ్ల బాలిక జన్మనిచ్చింది.. ఎక్కడ?

Advertiesment
victim
, ఆదివారం, 28 మే 2023 (13:46 IST)
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో 12 యేళ్ల బాలిక మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలిక గర్భందాల్చిన విషయాన్ని కనీసం బాలిక తల్లిదండ్రులు కూడా గుర్తించలేకపోవడం గమనార్హం. 
 
ఈ బాలిక ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. విషయం ఆమెకు తెలియకపో వడం గమనార్హం. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ గురునానక్ దేవ్ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు. ఆ తర్వాత ప్రసవం చేసి.. 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. తల్లీబిడ్డల పరిస్థితి విష మంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తన కుమార్తె గత ఏడు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె తండ్రి తెలిపాడు. నొప్పి అన్నపుడల్లా.. మందులు తెచ్చి ఇచ్చేవాడినని వివరించాడు. ఆసుపత్రికి వచ్చిన తర్వాతే గర్భవతి అని తెలిసిందన్నాడు. 
 
ఇంట్లో తామిద్దరమే ఉంటామని, తన భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిందని చెప్పాడు. బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల కిందట బహిర్భూమికి వెళ్లినపుడు తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. త్వరలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ రాజకీయ మహనీయుడు ఎన్టీఆర్ : నరేంద్ర మోడీ