Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రగడ్డలో భర్తతో విడిపోయిన ఒంటరి మహిళ మెడపై కత్తితో దాడి, చనిపోయిందనీ...

Advertiesment
ఎర్రగడ్డలో భర్తతో విడిపోయిన ఒంటరి మహిళ మెడపై కత్తితో దాడి, చనిపోయిందనీ...
, మంగళవారం, 11 జనవరి 2022 (20:48 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ నడిరోడ్డుపై దారుణం ఘటన చోటుచేసుకుంది. భర్తతో విడిపోయి వంటరిగా వుంటున్న ఓ మహిళపై ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మహిళను కత్తితో పొడుస్తుండగా స్థానికులు భీతావహులై తలుపులు వేసుకుని గజగజ వణికిపోయారు.

 
ఆ ఘటన వివరాలు ఇలా వున్నాయి. ఎర్రగడ్డ రోడ్డుపై వెళుతున్న మహిళ మెడపై కత్తితో ఖలీల్ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ దాడిలో మహిళ అక్కడే ఒరిగిపోయింది. దీనితో ఆమె మృతి చెందిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ దాడిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీసారు.

 
దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లాక పోలీసులకు సమాచారం అందించారు. కాగా దాడి చేసిన ఖలీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణా రాష్ట్రంలో కొత్తగా 1,920 కోవిడ్ కేసులు