Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Advertiesment
tiger

ఐవీఆర్

, సోమవారం, 12 మే 2025 (21:01 IST)
క్రూర జంతువు పెద్దపులి దాడిలో రాజస్థాన్ రాష్ట్రంలోని రణ్‌థంబోర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ రేంజర్ దేవంద్ర్ చౌదరి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం ఈ భీతావహ సంఘటన జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ జోన్ 3లోని యగ్యశాల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
 
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... ఫారెస్ట్ రేంజర్ రొటీన్ చెకింగులో భాగంగా చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడికి ఎదురుగా పెద్దపులి వచ్చేసింది. వెంటనే అతడిపై దాడి చేసి తలను కొరుకుతూ ఆ తర్వాత మెడను కొరికేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహం వద్ద 20 నిమిషాల పాటు అలాగే వుండిపోయింది. ఈ దారుణాన్ని చూసినవారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజర్ మృతదేహం దగ్గర్నుంచి అతికష్టమ్మీద పెద్దపులిని తరిమేశారు. అనంతరం అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు