Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....

Advertiesment
ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....
, మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:04 IST)
తల్లి దారుణానికి తెగబడింది. నెల కూడా నిండని పసికందును తన చేతులతో చంపేసింది. ఈ దారుణం డిసెంబర్ 9న జరిగింది. ఐతే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

 
కొట్టాయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల మహిళకు నవంబరు నెలలో మగశిశువును ప్రసవించింది. ఐతే ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రి చుట్టూ తిరుగాల్సి వచ్చింది. మరోవైపు భర్త ఆమెను విడిచి దూరంగా వుంటున్నాడు.

 
దాంతో మరో యువకుడు ఈమెకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. దాంతో కోపం పట్టలేక ఆ శిశువు తలను గోడకేసి కొట్టింది. అంతే.. బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

 
ఐతే ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఐతే బిడ్డ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అతడికి వెనుక పుర్రెపై గాయాలున్నట్లు తేలింది. దీనితో బిడ్డ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వృద్దాప్య పెన్షన్ రూ. 2500