బంగ్లాదేశ్ జట్టుకు వార్మప్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు ధోనీ, రాహుల్ సెంచరీ కొట్టారు. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రత్యర్థి జట్టుకు కూడా బౌలింగ్ చేశాడు. ఇంకా ధోనీ ప్రత్యర్థి జట్టుకు ఫీల్డింగ్ సెట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇకపోతే.. బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 99 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, నాలుగు సిక్సులు వున్నాయి. ధోనీ 78 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సులతో 113 పరుగులు సాధించాడు. ధోని ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మరోవైపు ధోనీ ప్రత్యర్థి జట్టుకు ఫీల్డింగ్ సెట్ చేయడం కూడా వివాదాస్పదమైంది. ఇక ధోని బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు 40వ ఓవర్‌ను పార్ట్ టైమ్ స్పిన్నర్ షబ్బీర్ రెహ్మాన్ వేశాడు. అయితే బౌలర్ కోసం ధోనినే ఫీల్డింగ్ పెట్టడం విశేషం.
షబ్బీర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ధోని స్ట్రైక్‌లో ఉన్నాడు. ఒక ఫీల్డర్ మాత్రం కదులుతూనే ఉన్నాడు. సాధారణంగా ఆ ఫీల్డర్ షార్ట్ స్క్వేరిష్ ఫైన్ లెగ్ రీజన్‌లో ఉండాలి. కానీ అతడు వేరే ప్లేస్‌లో ఉన్నాడు.
దీన్ని గమనించిన ధోని బౌలింగ్ వేయడాన్ని ఆపి.. ఫీల్డర్‌ను పొజిషన్‌లోకి వెళ్ళమని చెప్పు అని బౌలర్‌కు సూచించాడు. తన తప్పును తెలుసుకున్న బౌలర్ ఫీల్డర్‌ను అక్కడికి పంపించాడు.
నాన్ స్ట్రైకర్‌లో ఉన్న రాహుల్, అంపైర్, కామెంట్రేటర్లు అందరూ నవ్వుకున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా.. వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.