Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెబ్‌సిరీస్‌లో నా తమ్ముడు నటిస్తున్నాడు.. నేను కాదు: యువీ

Advertiesment
Yuvraj singh
వెబ్ సిరీస్‌లో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. వాస్తవానికి ఆ వెబ్ సిరీస్‌లో తన తమ్ముడు జొరావర్ సింగ్ నటిస్తున్నాడని వెల్లడించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ట్వీట్ చేశాడు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అయిన యువరాజ్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారని ప్రచారం జోరుగా సాగింది.
 
కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్ గుడ్‌చెప్పిన యూవీ.. అప్పుడప్పుడు ఇతర టీ-20, టీ-10 మ్యాచ్‌ల్లో మాత్రం మెరుస్తున్నాడు. అయితే.. ఈ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ త్వరలో ఓ వెబ్ సిరీస్‌ద్వారా తెరంగేట్రం చేస్తున్నట్టు సోషల్ మీడియా కోడై కూసింది.. ఈ వార్త కాస్త వైరల్‌గా మారిపోయింది. 
 
దీనిపై స్పందించిన యువీ తాను వెబ్ సిరీస్‌లో నటించట్లేదని చెప్పాడు. తాను నటించడంలేదని.. తాను నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం అంటూ తేల్చేశారు. మీడియాలో ఉన్న స్నేహితులు ఇది సరిదిద్దుకోవాలని సూచించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీకి బాడీగార్డ్‌గా మారిన స్వప్న.. ఎవరీమె.. వీడియో వైరల్! (Video)