Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ - పాకిస్థాన్ యుద్ధం అప్‌డేట్స్ : ఐపీఎల్ రద్దు యోచనలో బీసీసీఐ

Advertiesment
ipl2024

ఠాగూర్

, శుక్రవారం, 9 మే 2025 (08:28 IST)
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునే పరిస్థితిలు నెలకొనడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఐపీఎల్ 2025 పోటీల్లో భాగంగా, గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌ను పొరుగు నగరాలైన జమ్మూ, పఠాన్‌కోట్లలో వైమానిక దాడుల హెచ్చరికల నేపథ్యంలో మధ్యలోనే రద్దు చేసిన విషయం తెలిసిందే.
 
ఇప్పుడు భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా మొత్తం లీగ్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని సమాచారం. దీంతో ' సమావేశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.
 
గురువారం రాత్రి మ్యాచ్ రద్దు కావడంతో లీగ్ ముందుకు సాగుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు లేవనెత్తిన భద్రతా సమస్యల మధ్య శుక్రవారం బీసీసీఐ సమావేశం కానుందని తెలిసింది.
 
కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన పక్షం రోజుల తర్వాత పాకిస్థానులోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే.
 
గురువారం జమ్మూలో వైమానిక దాడుల హెచ్చరికలు, పేలుడు వంటి శబ్దాల నివేదికల మధ్య పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్ కోట్, అమృత్‌సర్, జలంధర్, హోషియార్పూర్, మొహాలి, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ సహా అనేక జిల్లాల్లో బ్లాక్ అవుట్ అమలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

India Pakistan War: ధర్మశాలలో బ్లాక్‌ఔట్, ఫ్లడ్ లైట్స్ ఆఫ్, స్టేడియం నుంచి వెళ్లిపోండి