Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్

నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. పైగా ఈ మ్యాచ్ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో శ్రీలంక పరువు పోయినట్టయింది.

భారత బౌలర్లధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాం : లంక కెప్టెన్
, మంగళవారం, 28 నవంబరు 2017 (11:23 IST)
నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు చిత్తుగా ఓడింది. పైగా ఈ మ్యాచ్ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో శ్రీలంక పరువు పోయినట్టయింది. ఈ ఓటమిపై శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్ విలేకరులతో మాట్లాడుతూ, మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లు, రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక ఉక్కిరిబిక్కిరైందన్నారు.
 
మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 400 పరుగులు అయినా స్కోర్ చేసి ఉంటే బాగుడేందన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓ మంచి స్కోర్ ఉంటేనే ప్రత్యర్థి జట్టుని ఎదుర్కొగలమన్నారు. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి మూడు రోజులు పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు మ్యాచ్‌ని అదే ఊపులో నాలుగో రోజు కొనసాగించుంటే ప్రత్యర్థి జట్టు ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఈ మ్యాచ్‌లో తాము ఎదుర్కుంటున్న బౌలర్లు నలుగురే... అయితే వారితో కానీసం మూడు స్పెల్స్ అయినా బంతులు వేసేలా చేసి ఉంటే వాళ్లు అలిసిపోయి ఐదో బౌలర్‌కి బౌలింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చేదని, కానీ, తాము ఆ పని చేయించలేకపోయామన్నారు. ఈ కారణంగానే తాము ఓడిపోయినట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీకి రెస్ట్ : టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ