Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ టెస్ట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం...

విరాట్ కోహ్లీ సేన గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. పర్యాటక శ్రీలంక జట్టుపై టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భార‌త్ తొలి ఇన్నింగ్స

భారత్ టెస్ట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం...
, సోమవారం, 27 నవంబరు 2017 (15:24 IST)
విరాట్ కోహ్లీ సేన గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ విజయం భారత టెస్ట్ చరిత్రలోనే అతిపెద్దది. పర్యాటక శ్రీలంక జట్టుపై టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ 610/6 వ‌ద్ద‌ డిక్లేర్ చేయగా, శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 205కే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ లంకేయులు ఏ మాత్రం కుదురుగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక‌ 166 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో భార‌త్‌ ఇన్నింగ్స్, 239 ప‌రుగుల‌ తేడాతో విజ‌యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త ఆట‌గాళ్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ శ‌త‌కాలు, కోహ్లీ ద్విశ‌త‌కం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.
 
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 610/6 పరుగులు చేయింది. దీంతో 408 రన్స్ వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక ఆటగాళ్లు భార‌త బౌల‌ర్ల ధాటికి మైదానంలో నిల‌వ‌లేక‌పోయారు. సమరవిక్రమ, పెరీరా, హెరాత్, గ్యామెజ్‌ ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే వెనుదిర‌గ‌గా, కరుణరత్నే 18, తిరిమన్నే 23, మ్యాథ్యూస్ 10, డిక్ వెల్లా 4, ష‌న‌క 17, ల‌క్మ‌ల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చండిమ‌ల్ (61) చేసిన ఒంట‌రి పోరాటం వృథా అయింది. చివరకు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 166 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భార‌త్ నిలిచింది.
 
కాగా, భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (213) సూపర్‌ డబుల్‌ సెంచరీకి రోహిత్‌ శర్మ (102 నాటౌట్‌ ) సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. దీంతో 610/6 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది టీమిండియా. మూడో టెస్టు డిసెంబర్ 2న ఢిల్లీలో ప్రారంభం కానుంది.
 
సంక్షిప్త స్కోర్లు
లంక తొలి ఇన్నింగ్స్: 205 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 610/6
లంక రెండో ఇన్నింగ్స్: 166 ఆలౌట్
ఫలితం : ఇన్నింగ్స్ 239 రన్స్ 
 
ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు విజయ్(128), పుజారా(143), రోహిత్ శర్మ(102 నాటౌట్) సెంచరీలు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ(213) ద్విశతకం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత గ్రేట్ ఆల్‌రౌండర్... 300 వికెట్ల క్లబ్‌లో అశ్విన్