Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kohli was Right- Dhoni was Wrong- Babar was out.. ధోనీ తప్పు చేశాడా?

Advertiesment
Kohli was Right- Dhoni was Wrong- Babar was out.. ధోనీ తప్పు చేశాడా?
, మంగళవారం, 18 జూన్ 2019 (19:13 IST)
ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహం ఓడింది. కానీ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహం మాత్రం గెలిచింది. ధోనీ కంటే మెరుగ్గా కోహ్లీ వ్యూహాన్ని గమనించాడు. దీంతో ధోనీ వ్యూహం తొలిసారి తప్పైందా అనే చర్చ మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే..? ఆదివారం (జూన్ 16)న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. 
 
ఇంకా ఈ మ్యాచ్‌కు వరుణుడు కూడా అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో డీఆర్ఎస్‌లో అదరగొట్టే ధోనీ, పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి తప్పు చేసినట్లు క్రికెట్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో సాహెల్ విసిరిన 19వ ఓవర్లో ఐదో బంతికి.. అజామ్ ఎల్‌బీడబ్ల్యూగా అవుటైనట్లు సాహెల్ చెప్పడంతో ధోనీ నమ్మేశాడు. కానీ విరాట్ కోహ్లీ రివ్యూ చేద్దామా అని ధోనీని అడిగాడు. ధోనీ బంతి బ్యాట్‌లో పడిందని చెప్పాడు. దీంతో రివ్యూకు కోహ్లీ వెళ్లలేదు. అప్పటికే బబాల్ 34 పరుగులు సాధించాడు. అయితే రిప్లేలో బంతి తొలుత ప్యాడ్‌‌ను తాకిందని తెలిసింది. దీంతో బాబర్ అజామ్ అవుట్ అని తెలిసింది. 
webdunia
 
ఆపై బాబర్ కుల్దీప్ బౌలింగ్‌లో 48 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ ధోనీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొలిసారి ధోనీ తప్పు చేశాడని.. రివ్యూకు పోనీయకుండా.. పాకిస్థాన్‌కు ఓ పది పరుగులు వచ్చేలా చేశాడని ఆడిపోసుకుంటున్నారు. ధోనీ కంటే కోహ్లీ ఈ అవుట్‌ను ముందే గ్రహించగలిగాడని చర్చించుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ పసికూన బౌలింగ్ ఊచకోత : సిక్సర్ల మోత.. మోర్గాన్ వరల్డ్ రికార్డు