Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్‌లోనూ జాత్యంహకార వ్యాఖ్యలు: డారెన్‌ సామి

ఐపీఎల్‌లోనూ జాత్యంహకార వ్యాఖ్యలు: డారెన్‌ సామి
, సోమవారం, 8 జూన్ 2020 (08:56 IST)
అమెరికాను వణికిస్తున్న జాత్యహంకార వ్యాఖ్యల సెగ ఐపీఎల్ కూ తగిలేలా వుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో సన్‌రైజర్స్‌కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్‌కు మద్దతుగా స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సామి పేర్కొన్నాడు.

ఐపిఎల్‌లో తనపై కూడా జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని, వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నేను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కాలు' అనే పదంతో పిలిచేవారు.

అప్పట్లో కాలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది" అని తెలిపాడు. అలాగే, అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్‌ బోర్డులకు ట్విటర్‌ వేదికగా సామి విజ్ఞప్తి చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రోజు నా భార్య ఎందుకు ఏడ్చిందంటే? రోహిత్ శర్మ