రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి... బీరు సీసాలతో తలపగులగొట్టారు...

గురువారం, 5 మార్చి 2020 (11:10 IST)
సినీ గాయకుడు, బిగ్‌బాస్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో దాడి జరిగింది. బీరు సీసాలతో కొట్టడంతో చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు బుధవారం రాత్రి వెళ్లాడు.
 
కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వచ్చిన యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాహుల్‌ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. 
 
రాహుల్‌ను బీరు సీసాలతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాహుల్‌ చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మెగాస్టార్ ఆఫర్ ఇస్తే నో చెప్పిన హరీష్ శంకర్, ఎందుకో తెలుసా..?