Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సజావుగానే ప్రజా సంక్షేమ పథకాలు: ఏపీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి

Advertiesment
సజావుగానే ప్రజా సంక్షేమ పథకాలు: ఏపీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి
, బుధవారం, 6 మే 2020 (20:30 IST)
కరోనా క్లిష్ట సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “వైఎస్సార్ మత్స్యకార భరోసా” కింద వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి రూ. 100 కోట్లు విజయవంతంగా విడుదల చేయడం డిజిటలైజేషన్ ఫలితమేనని, పేద ప్రజల సంక్షేమానికి ఉద్ధేశించిన పథకాలన్నీ సజావుగా జరుగుతున్నాయని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంపేర్ సింగ్ రావత్ అన్నారు.

సచివాలయంలో బుధవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి షంపేర్ సింగ్ రావత్ అధ్యక్షతన అన్ని శాఖల విభాగాధిపతులు, సచివాలయంలోని  వివిధ శాఖల విభాగాధిపతులతో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మ్యాడ్యుల్ అమలు పై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన వివిధ విభాగాధిపతులను ఉద్ధేశించి మాట్లాడుతూ డిజిటలైజేషన్ వల్లనే కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వం అన్ని పనులను సక్రమంగా చేయగల్గుతుందని, ఈ-ఆఫీస్ ద్వారానే సిబ్బంది ఇంట్లో కూర్చుని కూడా ప్రజలకు సేవలు అందించగల్గుతున్నారని తెలిపారు. 

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ లో భాగమైన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కింద రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరి సర్వీస్ రిజిస్టర్లు, సర్వీస్ రూల్స్ ను ఉద్యోగుల నియామకం నుండి పదవీ విరమణ వరకు ప్రతి అంశాన్ని డిజిటలీకరణ చేయడం జరుగుతుందన్నారు.

సీఎఫ్ఎంఎస్ అమలు ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని, సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ లో అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్థిక శాఖ డీటీఏ, పే అండ్ అకౌంట్స్, వర్క్స్ అండ్ అకౌంట్స్, ఏపీజీఎల్ఏ కార్యాలయాలలో పనితీరును సరిచూసుకున్నామని ఆయన తెలిపారు.

ఈ సాఫ్ట్ వేర్ వల్ల ఉపయోగాలు అనేకమని, అన్ని సమస్యల పరిష్కారానికి ఇది ఒకేసారి పెట్టేపెట్టుబడి అని ఆయన అన్నారు. సెక్రటేరియట్ మరియు శాఖ ముఖ్య కార్యాలయాల సిబ్బంది ఎస్ఆర్  డిజిటలైజేషన్ ప్రక్రియ మే నెలాఖరుకు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఎస్ఆర్  డిజిటలైజేషన్ ప్రక్రియ జూన్ 15 కు పూర్తి అవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శిక్షణకు హాజరైన వివిధ శాఖల ప్రతినిధులను ఆదేశించారు. 

ముఖ్యఅతిధిగా హాజరైన సర్వీసుల విభాగం కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో భౌతిక దూరం పాటిస్తూ ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించినందుకు అభినందిస్తున్నానన్నారు.

హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో ఉద్యోగులకు సంబంధించిన ఇంక్రిమెంట్, ప్రమోషన్, క్రమశిక్షణా చర్యలు, కుటుంబ వివరాలు వంటి ప్రతి అంశాన్ని నమోదు చేస్తారని, దీనివల్ల జాప్యం లేకుండా ప్రతి పని నిర్ణీత వ్యవధిలో పూర్తి అవుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల విభాగం నుంచి వివరాల నమోదు కు సంబంధించిన సందేహాల నివృత్తికి సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. 

సీఎఫ్ఎంఎస్ సీఈవో ఎంఎన్ హరేంధ్ర ప్రసాద్ మాట్లాడుతూ సిబ్బందికి ఈఎస్సార్ (ఎలక్ట్రానికి సర్వీస్ రిజిష్టర్) వంటి సదుపాయం  కల్పించడం ద్వారా సిబ్బంది నుండి మంచి ఫలితాలను పొదగల్గుతామని, రిటైర్మెంట్ తర్వాత జరిగే లావాదేవీలను ఈఎస్సార్ లో నమోదు చేస్తారని తెలిపారు.  ఇప్పుడు ఉన్న భౌతిక ఎస్సార్ లు  డిజిటల్ ఎస్సార్ లకు ప్రాతిపదికలని ఆయన తెలిపారు. 
 
ఖజానా శాఖ సంచాలకులు బీఎల్ హనుమంతరావు మాట్లడుతూ తన 33 ఏళ్ల సర్వీసులో 26 విభాగాల్లో పనిచేసానని, 70 శాతం ఉద్యోగుల సమస్యలు వారి ఉద్యోగ వ్యవహారాల (సర్వీస్ మేటర్) కు సంబంధించినవేనని, ఈఎస్సార్ లో వివరాలను సక్రమంగా నమోదు చేయటం వల్ల వాటిని అధిగమించవచ్చని తెలిపారు.

ఈ ఎస్సార్ లో నమోదు ద్వారా కోర్టు వివాదాలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఫైనాన్స్ అడిషినల్ కార్యదర్శి నాగ మల్లేశ్వరరావు, డీటీఏ అదనపు సంచాలకులు శివప్రసాద్, సంయుక్త సంచాలకులు శ్రీనివాసులు నాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో ప్రజా రవాణాకు అనుమతి?