Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంఎస్ ధోని మాజీ ప్రియురాలు ప్రియాంక ఫోటో వైరల్.. మహీ జీవితంలో?

Advertiesment
Dhoni_Priyanka
, సోమవారం, 18 డిశెంబరు 2023 (16:30 IST)
Dhoni_Priyanka
ఎంఎస్ ధోని మాజీ ప్రియురాలు ప్రియాంక ఝా ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
 
మహేంద్ర సింగ్ ధోని తన వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరచుగా వార్తల్లో ఉంటాడు. ధోని సాక్షిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అందమైన కుమార్తె జీవా వుంది. అయితే ధోనీ పెళ్లికి ముందు ప్రేమాయణం చాలామందికి తెలియదు. 
 
ధోని ప్రియాంకను గాఢంగా ప్రేమించాడని, అయితే క్రికెటర్ ఆమెను వివాహం చేసుకోలేకపోయాడు. తాజాగా ప్రియాంక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. సాక్షి కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ చిత్రం ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో ఈ విషయాన్ని ప్రస్తావించబడింది.
 
 ధోనీ గర్ల్‌ఫ్రెండ్ పేరు ప్రియాంక ఝా, ఆమె చాలా అందంగా ఉంది. ఆమె తన సింప్లిసిటీతో చాలా మంది బాలీవుడ్ నటీమణులను ఓడించింది. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలో ప్రియాంక ఝా పాత్రను నటి దిశా పటానీ పోషించింది.
 
ఆ క్రికెటర్‌కి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉందని సినిమా విడుదలకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రియాంక ఝా, ధోనీ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ రోడ్డు ప్రమాదంలో ధోనీ స్నేహితురాలు ప్రియాంక మరణించింది. 
webdunia
Dhoni_Priyanka
 
దీంతో ధోనీ పూర్తిగా డీలాపడిపోయాడు. ఈ దుఃఖం నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ధోనీ జీవితంలోకి సాక్షి ప్రవేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతలకు సచిన్ బైబై