షాబాజ్ తొలి వికెట్.. మైదానంలో సంబరాలు వీడియో వైరల్

సోమవారం, 21 అక్టోబరు 2019 (13:11 IST)
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ టెస్టులో తొలి వికెట్ పడగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాంచీ టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన నదీమ్ తొలి వికెట్‌తో ఇన్నింగ్స్ 28వ ఓవర్‌ రెండో బంతికి టెంబా బావుమా(32) పరుగుల వద్ద ఔటయ్యాడు. నదీమ్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన బావుమా వికెట్ల ముందుకొచ్చి ఆడాడు.
 
ఈ సమయంలో వృద్ధిమాన్ సాహా ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహారించి అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. టెస్టుల్లో షాబాజ్ నదీమ్‌కు ఇదే తొలి వికెట్ కావడం విశేషం. తొలి వికెట్ తీసిన ఆనందంలో అతడు మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు సహకర క్రికెటర్లు సైతం అతడిని అభినందనలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాంచి టెస్ట్ : ఉమేష్ సిక్సర్ల్ మెరుపులు... భారత్ స్కోరు 497/9 డిక్లేర్డ్