Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొహాలీలో సఫారీలను కుమ్మేశారు... 7 వికెట్లతో ఘన విజయం

మొహాలీలో సఫారీలను కుమ్మేశారు... 7 వికెట్లతో ఘన విజయం
, గురువారం, 19 సెప్టెంబరు 2019 (06:23 IST)
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా, ధర్మశాలలో జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి మొహాలీ వేదికగా రెండో ట్వంటీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. 
 
ఐఎస్ బృందా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు... నిర్ణీత 20 ఓవర్లోల 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, నవ్‌దీవ్ శైనీలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. లక్ష్య ఛేదనలో తడబడ్డారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం వీరోచిత పోరాటం చేసి జట్టును గెలిపించాడు. 
 
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ - ధవాన్‌లు ఇన్నింగ్స్‌ను ఘనంగానే ఆరంభించారు. అయితే 33 పరుగుల వద్ద రోహిత్ శర్మ(12) ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీతో ధవాన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. రెండో వికెట్‌కి వీరిద్దరూ కలిసి 61 పరుగులు వీరిద్దరు జోడించారు. అయితే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధవాన్ ఔట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్(4) మరోసారి విఫలమయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఫలితంగా భారత 19 ఓవర్లలో 151 పరుగులు చేసి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీ అందుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య బేబీ బంప్ పైన ఆండ్రూ రస్సెల్ సుతిమెత్తగా చేయి వేసి... (Video)