Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2024 : పంజాబ్‌ను చిత్తు చేసిన సన్ రైజర్స్ - అభిషేక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

abhishek sharma

ఠాగూర్

, ఆదివారం, 19 మే 2024 (19:40 IST)
ఐపీఎల్ 2024 సీజన్ టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌‍లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు నిర్దేశించిన 214 పరుగుల భారీ విజయలక్ష్యానని మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ జితేశ్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆ జట్టు తొలుత బ్యాటింగ్ 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 214 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ అధర్వ టైడ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 71, రిలీ రస్కో 49, జితేశ్ శర్మ 32 చొప్పున పరుగులు చేయగా, అదనపు రన్స్ రూపంలో 10 పరుగులు వచ్చాయి. ఫలితంగా 214 పరుగుల భారీ స్కోరు చేసింది. 
 
ఆ తర్వాత 215 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ జట్టులో ట్రవీస్ హెడ్ డకౌట్ కాగా అభిషేక్ శర్మ 28 బంతుల్లో 66 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. శర్మ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. అలాగే, రాహుల్ త్రిపాఠి 33, నితీశ్ కుమార్ రెడ్డి 37, క్లాసెన్ 42, అబ్దుల్ సమద్ 11, సన్వీర్  సింగ్ 6 చొప్పున పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అభిషేక్ శర్మకు ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2024 : చివరి లీగ్ మ్యాచ్‌ టాస్ గెలిచిన పంజాబ్ జట్టు