శ్రీలంక పర్యటనకు ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ దూరం కానున్నాడు. మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అయ్యర్ గాయపడటంతో అతని భుజానికి ఏప్రిల్ 8న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతడు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు.
అయ్యర్ కోలుకోవడానికి ఇంకా మూడునెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రేయస్ ఫిట్‌గా ఉంటే లంక టూర్‌లో భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చేది.
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే సిరీస్ జూలై 13న ప్రారంభంకానుంది.