Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంత మైదానంలో చిత్తుగా ఓడిన బెంగుళూరు - వెక్కి వెక్కి ఏడ్చిన బాలుడు (Video)

Advertiesment
fan boy

ఠాగూర్

, గురువారం, 3 ఏప్రియల్ 2025 (14:57 IST)
స్వదేశంలో జరుగుతున్న సంపన్న క్రీడగా గుర్తింపు పొందిన ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, బుధవారం బెంగుళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంత గడ్డపై బెంగుళూరు జట్టు ఓటమిని చవిచూసింది. దీన్ని ఆర్సీబీ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమి నేపథ్యంలో ఇప్పటికే ఆ జట్టుపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ మొదలయ్యాయి కూడా. 
 
సొంత మైదానంలో బెంగుళూరు ఓటమిని చూసి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ బాలుడు జట్టు పరాజయం తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఒకటి ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మొదట ఆ బాలుడు తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ ఔటైనపుడు ఏడుస్తూ కనిపించాడు. 
 
చివరికి మ్యాచ్ కూడా చేజారిపోవడంతో బుడతడు వెక్కి వెక్కి ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ ఓటమిపై తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. "ఒక్క ఓటమికే ఇలా అయిపోతే ఎలాబ్రో... ఆర్సీబీ జట్టుకు, ఫ్యాన్స్‌కు ఇలాంటి ఓటములు సహజం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2025 : సొంతగడ్డపై బెంగుళూరును చిత్తు చేసిన గుజరాత్