ప్రతిష్టాత్మిక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో సీనియర్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు. భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన కంటే ఎంతో మెరుగైన, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ను ఓడిస్తూ మలేషియా ఓపెన్ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
మరోవైపు డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇదే టోర్నమెంట్‌లో అతి కష్టం మ్మీద ప్రీక్వార్టర్స్ అధిగమించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో అన్ సీడెడ్ ఆటగాడైన ప్రణయ్ 21-15, 21-7తో నాలుగో ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)ను వరుస గేముల్లో చిత్తు చేసి ఔరా అనిపించాడు. క్వార్టర్ ఫైనల్లో అతను ఏడోసీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో తలపడతాడు.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 9-21, 21-9,21-14తో చైవాన్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. దాదాపు గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత వరుస గేమ్‌లు నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.