Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో నష్టాలు రాలేదు.. లాభాలు వచ్చాయ్ : పాక్ క్రికెట్ బోర్డు

Advertiesment
champion trophy

ఠాగూర్

, శుక్రవారం, 21 మార్చి 2025 (14:47 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ నష్టాలను చవిచూసిందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జావెద్ ముర్తాజా స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాల మేరకు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ ద్వారా నష్టాలను చవిచూడలేదని, దాదాపు 280 కోట్ల రూపాయల మేరకు లాభాలను అర్జించామని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఖర్చులను ఐసీసీ భరించింది. టిక్కెట్ల అమ్మకాలు, ఇతరాలతో పీసీబీకి ఆదాయం వచ్చింది. ఆడిట్ తర్వాత ఐసీసీ నుంచి మాకు అదనంగా రూ.92 కోట్లు వస్తాయని భావిస్తున్నాం. మేం అనుకున్న లక్ష్యాలను ఇప్పటికే అధిగమించాం. ఈ టోర్నీ నిర్వహణ ద్వారా అనుకున్న దానికంటే భారీగానే ఆదాయం సమకూరింది. 
 
ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.1.20 కోట్లు చెల్లించాం. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణతో పీసీబీ ప్రపంచంలోనే మూడో ధనవంతమైన బోర్డుగా మారనుంది. కేవలం నాలుగు నెలల్లోనే స్టేడియాలను మరమ్మతులు చేశాం. ఇదంతా పీసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ చొరవతోనే సాధ్యమైంది. ప్లేయర్ల జీత భత్యాల్లో కోత విధింపు నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ వెనక్కి తీసుకున్నారు. 
 
చాంపియన్స్ ఫైనల్ అనంతరం పాకిస్థాన్ నుంచి ఏ ప్రతినిధిని ట్రోఫీ అందజేసే పోడియం పైకి ఆహ్వానించకపోవడంపై ఐసీసీని వివరణ కోరాం. సమాధానం కోసం వేచిచూస్తున్నాం. త్వరలోనే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను అధికారిక వెబ్‌‍సైట్‌లో ఉంచుతాం. ఇక్కడ ప్రతి విషయమూ పారదర్శకంగానే సాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాహల్ - ధనశ్రీ విడాకుల ఖరీదు రూ.4.75 కోట్లు!!