Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియా మా దేశానికి ఎందుకు రాదో లిఖితపూర్వకంగా బదులివ్వాలి : పీసీబీ

pakistan flag

ఠాగూర్

, బుధవారం, 13 నవంబరు 2024 (10:16 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సివుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. ఈ విషయాన్ని ఐసీసీ చైర్మన్ జై షా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. అయితే, తమ దేశంలో భారత క్రికెట్ జట్టు ఎందుకు పర్యటించదో తమకు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పీసీబీ కోరుతుంది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లో ఈ టోర్నీ జరుగనుంది. భద్రతా కారణాల రీత్యా ఆతిథ్య పాకు టీమిండియాను పంపించబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇది పీసీబీ ఏమాత్రం రుచించడం లేదు. అందుకే లిఖతపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కోరుతుంది. అదేసమయంలో ఇరుదేశాల మధ్య మరో వివాదం చెలరేగింది.
 
భారత్ వేదికగా మంగళవారం ముగిసిన ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు ఇవ్వలేదని కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు ఆరోపించారు. రెండు నెలల ముందుగానే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ తాత్సారం చేశారని చెబుతున్నారు. అయితే పాక్ జట్టుకు 12 వీసాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు తిరస్కరించామంటూ వచ్చిన మీడియా కథనాలను చూశామని, నవంబర్ 7వ తేదీన 12 మంది పాక్ ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. సకాలంలోనే జారీ చేశామని అన్నారు. అయితే పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లందరికీ వీసాలు జారీ చేయలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. వీసా పొందిన ప్లేయర్లు కూడా చాలా ఆలస్యంగా ఆ వీసాలు అందుకున్నారని, దీంతో భారత్‌కు రాలేకపోయారని పేర్కొన్నారు.
 
కాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో భారత్‌కు వచ్చి టోర్నీలో పాల్గొని గెలిచిన ఆటగాళ్లతో పాటు జట్టులోని సగం మంది ఆటగాళ్లకు వివరణ లేకుండానే వీసాలు తిరస్కరించారని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికాకు తరలిపోనున్న చాంపియన్స్ ట్రోఫీ వేదిక.. పాకిస్థాన్ దూరం!?