Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ కుర్రోడి నైపుణ్యానికి సచిన్ ఫిదా .. నాకూ నేర్పించాలంటూ చమత్కారం!

Advertiesment
Mumbai Teenager
, మంగళవారం, 2 మార్చి 2021 (11:44 IST)
రూబిక్స్‌ క్యూబ్‌ గురించి అందరికీ తెలిసిందే. అందులోని ఆరు వైపులా ఆరు రంగుల్ని ఒక వరుసలోకి తెచ్చేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు గంటల తరబడి సమయం తీసుకొని సెట్‌ చేస్తే మరికొందరు నిమిషాల్లో పూర్తి చేస్తారు. అలాంటిది.. ఓ యువకుడు కేవలం 17 క్షణాల్లో రంగుల్ని ఏకం చేసి ఔరా అనిపించాడు. అది కూడా రూబిక్స్‌ను చూడకుండా అన్ని వైపులా రంగుల్ని సరిచేశాడు. ఇది చూసిన క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అతడి ప్రతిభకు ఫిదా అయ్యాడు. అంతేనా.. తనకు శిక్షణ ఇవ్వాల్సిందిగా ఆ కుర్రోడిని చమత్కరించాడు.
 
దీనికి సంబంధించిన ఓ పోస్ట్‌ను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ యువకుడి ప్రతిభను అభిమానులతో పంచుకున్నాడు. గజిబిజిగా ఉన్న రూబిక్స్‌ను అతడు ఒకసారి తదేకంగా గమనించి తర్వాత దాన్ని చూడకుండానే 17 సెకన్ల సమయంలో దానిని సెట్‌ చేశాడు. 
 
సచిన్‌ దీన్నంతా వీడియోగా చిత్రీకరించి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 'కొద్దిసేపటి క్రితమే ఈ యువకుడిని కలిశాను. మనలో చాలా మంది చూసి కూడా చేయలేని పనిని.. అతడు చూడకుండా చేశాడు. అతని ప్రతిభకు ఆశ్చర్యపోతున్నానంటూ వ్యాఖ్యానించాడు. అలాగే అంత త్వరగా ఎలా చేస్తారనే విషయాన్ని తెలుసుకుంటాన'ని పేర్కొన్నాడు.




Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షమీతో మళ్లీ సంసారం.. సింధూరంతో హసిన్..? సహనమనే వేలు పట్టుకొని..?