టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ కంటే ధోనీయే గ్రెట్ కెప్టెన్ అని కొనియాడాడు. తాజాగా ట్వీట్టర్ వేదికగా ఓ అబిమానిగా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు.
పాంటింగ్, ధోనీలలో ఎవరు గొప్ప అని ఆ అభిమాని అడిగిన ప్రశ్రకు సమాధానం ఇస్తూ.. కెప్ట్‌న్‌గా పాటింగ్ కంటే ధోనీకే ఎక్కువ మార్కులు వేస్తాననని చెప్పాడు. ఎమ్‌ఎస్ యంగ్ స్టార్స్ కూడిన టీంను తయారుచేసి ముందుకు నడిపించాడని కామెంట్ రూపంలో ఆ అభిమానికి సమాధానం ఇచ్చాడు.
మ్యాచ్ గెలిపించే విషయంలో ధోనీ కంటే పాంటింగ్ కొంత మెరుగ్గా ఉన్నాడని.. అతని నాయకత్వంలోని టీం 324 మ్యాచ్‌లు ఆడగా 220 మ్యాచ్‌లు గెలిచి 77 మాత్రమే ఓడిపోయిందన్నాడు.
కానీ 2007 టీ-20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ టోర్నీలను గెలుచుకున్న ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్ ధోనీ అంటూ చెప్పాడు. 332 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన ఎమ్మెఎస్ 178 మ్యాచ్‌లు గెలిచి 120 మ్యాచ్ ఓడిపోయారని చెప్పాడు.
ఇంకా సురేష్ రైనాపై అఫ్రిది స్పందిస్తూ.. ధోనీ లాంటి నాయకత్వ లక్షణాలు ముందు సురేష్ రైనాలో కనిపించాయి. ఇప్పుడు రోహిత్ శర్మలో ఎమ్మెఎస్ లాంటి కెప్టెన్సీ శైలీ ఉంది. "భారత క్రికెట్ జట్టుకు తదుపరి ఎంఎస్ ధోని అతనే" అంటూ అఫ్రిది చెప్పుకొచ్చాడు.