Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yuvraj Singh: సముద్రపు నడిబొడ్డున మోడల్స్ మధ్యలో యువీ.. భజ్జీ ఫన్నీ కామెంట్

Advertiesment
yuvraj

సెల్వి

, మంగళవారం, 9 డిశెంబరు 2025 (14:42 IST)
yuvraj
టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. తాజాగా సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ కెనడాకు చెందిన విదేశీ మోడల్‌‌తో కలిసి దిగిన ఫోటోషూట్ సంచలనం సృష్టిస్తోంది. సముద్రం మధ్యలో తీసిన ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 
webdunia
Yuvraj Singh
 
బీచ్ వాతావరణంలో, సముద్రపు ఒడ్డున బీచ్ వేర్‌లో యువరాజ్ సింగ్ ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. ఈ ఫోటోషూట్‌లో పలువురు అంతర్జాతీయ మహిళా మోడల్స్ పాల్గొనగా.. వారిలో ఓ మహిళా మోడల్ ఫోటో నెటిజన్లను పెద్ద ఎత్తున ఆకర్షించింది. యువరాజ్ సింగ్‌తో ఉన్న ఆ ప్రత్యేక మహిళా మోడల్ పేరు అనాలియా ఫ్రేజర్. 
 
యువరాజ్ సింగ్, అనాలియా ఫ్రేజర్ కలిసి కనిపించిన ఈ ఫోటోలు ఏ వ్యక్తిగత బంధానికి సంబంధించినవి కావు. అవి ఫైనో టెకీలా అనే అంతర్జాతీయ కంపెనీ యాడ్ క్యాంపెయిన్‌లో భాగమని తెలుస్తోంది. యువరాజ్ ఫోటోషూట్‌ను చూసిన ఆయన చిరకాల మిత్రుడు, భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించిన తీరు నవ్వులు పూయించింది. తన స్నేహితుడిని ఆటపట్టిస్తూ హర్భజన్ ఇలా కామెంట్ చేశారు. 
webdunia
yuvraj
 
పాజీ ఇంటికి పోవాలా వద్దా.. ఇంత మంది మహిళలను కూడబెట్టారు. మంచి మనిషిగా మారిపోండని భజ్జీ సరదాగా యువరాజ్‌ను ఆటపట్టించారు. భార్య హేజల్ కీచ్ ఉన్నా కూడా యువరాజ్ ఇలా మోడల్స్‌తో ఫోటోలు దిగడంపై హర్భజన్ వేసిన ఈ సెటైర్ నెటిజన్లను మరింత ఆకర్షించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 మినీ వేలం.. 350మంది ఆటగాళ్లు సిద్ధం