Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భజ్జీ కొట్టినా సైలెంట్‌గా వుండిపోవడానికి కారణం అదే.. శ్రీశాంత్ వెల్లడి

Advertiesment
Bhajji

సెల్వి

, సోమవారం, 24 నవంబరు 2025 (16:34 IST)
Bhajji
పేస్ బౌలర్ శ్రీశాంత్​ను మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ తనను కొట్టిన తర్వాత కూడా తాను తిరిగి ఎందుకు ప్రతిదాడి చేయలేదో శ్రీశాంత్ వెల్లడించాడు. ఆ రోజు మైదానలో అందరిముందు తనను హర్భజన్ చెంపదెబ్బ కొట్టినా శ్రీశాంత్ ఎదురుదాడి చేయలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే ఏం జరిగి ఉండేదో కూడా తెలిపాడు. 
 
ఇంతకీ ఆ రోజు ఎందుకు హర్భజన్​ను తిరిగి కొట్టలేదంటే.. "ఆ రోజు నేను అలా చేసి ఉంటే నన్ను జీవిత కాలం క్రికెట్​ నుంచి నిషేధించేవారు. అప్పట్లో కేరళ క్రికెట్ బోర్డకు ఎక్కువ అధికారాలు ఉండేవి కాదు. 
 
అంతేకాకుండా ఆ సమయంలో కేరళ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్​ ఆడుతున్న ఏకైక క్రికెటర్​ను నేనే. అందుకే ఎలాంటి కాంట్రవర్సీలకు పోకూడని అనుకున్నాను" అని శ్రీశాంత్ వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త!!