Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడ్కోలు మ్యాచ్ సైతం ఆశించకుండా రిటైర్మెంట్ ప్రకటించిన కర్మయోగి

Advertiesment
MS Dhoni
, ఆదివారం, 16 ఆగస్టు 2020 (15:06 IST)
జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పాడు. దేశానికి రెండు ప్రపంచ కప్‌లు, ఒక ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించడమేకాకుండా అంత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 
 
ఒక ఆటగాడిగా, కెప్టెన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించిన మహీ స్వాతంత్య్ర దినోత్సవం రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు. దూకుడైన బ్యాటింగ్, వ్యూహరచనతో టీమ్ ఎన్నో చిరస్మణీయ విజయాలను సాకారం చేసిన ఆ దిగ్గజం ఇక బ్లూ జెర్సీని వదిలేస్తున్నట్టు ఆకస్మికంగా శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
నిత్యం ప్రేమ, మద్దతు తెలిపిన మీకు నా కృతజ్ఞతలు. 19.29 గంటల నుంచి నేను రిటైర్ అయినట్టు పరిగణించండి అని తన ఇన్‌స్టా ఖాతాలో మహేంద్రుడు వెల్లడించాడు. కంప్యూటర్ ప్రాసెసర్ కంటే వేగంగా మైదానాల్లో నిర్ణయాలు తీసుకొని జట్టుకు విజయాలు కట్టబెట్టిన ధోనీ.. రిటైర్మెంట్ విషయంలోనూ మళ్లీ అదే పంథాను అవలంభించాడు. 
 
ఆడంబరాలకు దూరంగా ఉండే లక్షణాన్ని కొనసాగిస్తూ.. వీడ్కోలు మ్యాచ్ సైతం ఆశించకుండా కర్మయోగిలా.. టీమ్ దూరమయ్యాడు. ఐపీఎల్ శిక్షణ శిబిరం కోసం చెన్నైలో ఉండే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. గతేడాది జూలై 10న వన్డే ప్రపంచకప్ సెమీఫైనలే ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్. మొత్తానికి ఈ ఏడాది ఐపీఎల్ దుమ్మురేపి మళ్లీ ధోనీ జట్టులోకి వస్తాడనుకున్న అభిమానులు నిరాశచెందారు. ప్రపంచకప్ వచ్చే ఏడాది వాయిదా పడటం కూడా ధోనీ నిష్క్రమణకు కారణమై ఉండొచ్చు. 
 
హెలికాప్టర్ షాట్లు, సూపర్ సిక్సర్లు, మెరుపు స్టంపింగ్స్ 15 యేళ్ల పాటు భారత అభిమానులను ఉర్రూతలూగించిన మహేంద్రుడు శనివారంతో తన ప్రయాణానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించిన భారత సారథి ఘనతలను ఓ సారి గుర్తుచేసుకుంటే..
 
వన్డేలు: మ్యాచ్ 350, పరుగులు: 10773, సగటు: 50.57, అత్యధిక స్కోరు: 183*, సెంచరీలు: 10, అర్ధసెంచరీలు: 73.
టీ20లు: మ్యాచ్ 98, పరుగులు: 1617, సగటు: 37.60, అత్యధిక స్కోరు: 56, సెంచరీలు: 0, అర్ధసెంచరీలు: 2, 
 
వికెట్ల ప్రదర్శన
టెస్టులు: క్యాచ్ 256, స్టంప్ 38
వన్డేలు: క్యాచ్ 321, స్టంప్ 123
టీ20లు: క్యాచ్ 57, స్టంప్ 34 
 
క్రికెట్ కెరీర్ 
తొలి టెస్టు: శ్రీలంకపై 2005 డిసెంబర్ 2న, చెన్నైలో
ఆఖరి టెస్టు: ఆస్ట్రేలియాపై 2014 డిసెంబర్ 30న మెల్
తొలి వన్డే : బంగ్లాదేశ్ 2004 డిసెంబర్ 23న చిట్టగాంగ్ 
ఆఖరి వన్డే: న్యూజిలాండ్ 2019 జూలై 9-10న మాంచెస్టర్ (వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్).. 
తొలి టీ20: దక్షిణాఫ్రికాపై 2006 డిసెంబర్ 1న జొహన్నెస్ 
చివరి మ్యాచ్: ఆస్ట్రేలియాపై 2019 ఫిబ్రవరి 27న, బెంగళూరులో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్ ప్రకటించారు : సాక్షి ధోనీ