టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా వస్తున్న వదంతులకు శనివారం తెరపడింది. మార్చి 14, 15వ తేదీల్లో గోవాలో బుమ్రా, టీవీ యాకంర్ సంజనా గణేశన్ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు యాక్టర్ తారా శర్మ సలుజా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.
కేవలం 20 మంది అతిథుల సమక్షంలో ఈ వివామ వేడుక జరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంజనా గణేశన్ తో బుమ్రా కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడని , ఇప్పడు పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇకపోతే.. అంతకుముందు, జస్ర్పీత్ బుమ్రా గతంలో హీరోయిన్ రాశీఖన్నాతో లవ్‌లో ఉన్నాడని, ఇటీవల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి.
దీనిపై క్లారిటీ ఇచ్చారు అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీతా పరమేశ్వరన్. అనుపమ, బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమేనని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.