Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓడినా మజా తగ్గలేదు.. పంత్ ఏం కొట్టాడు.. రాహుల్ గాల్లోకి లేచాడు.. (video)

Advertiesment
ఓడినా మజా తగ్గలేదు.. పంత్ ఏం కొట్టాడు.. రాహుల్ గాల్లోకి లేచాడు.. (video)
, శనివారం, 13 మార్చి 2021 (12:50 IST)
Rishabh Pant_Rahul
టీమిండియా యంగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ మైదానంలో చేసే చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా రివర్స్‌ స్కూప్‌ షాట్‌కు ఫేవరెట్‌గా మారిపోయాడు. మొన్నటికి మొన్న నాలుగో టెస్టులో జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్ షాట్‌ ఆడిన సంగతి తెలిసిందే.

తాజాగా తొలి టీ20లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో మరోసారి రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడిన పంత్‌ కళ్లు చెదిరే సిక్సర్‌ కొట్టాడు. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్లో 5వ బంతిని పంత్‌ మొత్తం మొ​కాళ్ల మీదకు వంగి రివర్స్‌ స్కూప్‌లో బ్యాట్‌ను పైకిలేపి థర్డ్‌మన్‌ దిశగా గాల్లోకి లేపాడు. అంతే సెకన్ల వ్యవధిలో బంతి బౌండరీ లైన్‌ ఆవల పడింది.
 
పంత్‌ షాట్‌కు ఆర్చర్‌ కాసేపు షాక్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌తో అలరిస్తే.. కేఎల్‌ రాహుల్‌ తన ఫీల్డింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొలి టీ20లో క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో రాహుల్‌ చేసిన ఒక ఫీట్‌ అభిమానులకు మజాను పంచింది. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ను అక్షర్‌ పటేల్‌ వేశాడు. అక్షర్‌ వేసిన తొలి బంతిని బట్లర్‌ భారీ షాట్‌ ఆడాడు.
 
అయితే బౌండరీ లైన్‌ వద్ద వేచి ఉన్న రాహుల్‌ బంతిని అందుకునే క్రమంలో గాల్లోకి లేచాడు. దాదాపు అందుకున్న రాహుల్‌ నియంత్రణ కోల్పోవడంతో బంతిని మైదానంలోకి విసిరేశాడు. కచ్చితంగా సిక్స్‌ అనుకున్న షాట్‌ను రాహుల్‌ ఆపిన తీరు అద్బుతమనే చెప్పొచ్చు.

అతని ఫీల్డింగ్‌ నైపుణ్యంతో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకవేళ రాహుల్‌ ఈ క్యాచ్‌ పట్టి ఉంటే మాత్రం చరిత్రలో నిలిచిపోయి ఉండేది. మ్యాచ్‌లో ఓడినా.. టీమిండియా బ్యాట్స్‌మెన్, బౌలర్ల ఆటతీరు అభిమానులను వీడియో రూపంలో ఆకట్టుకుంటోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీలా డకౌట్‌ అవుతారు జాగ్రత్త: ప్రజలకు ఉత్తరాఖండ్ పోలీసులు వార్నింగ్, ఎందుకు?