Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీరని పరుగుల దాహం.. వేటాడుతున్న విరాట్ కోహ్లి

virat kohli
, సోమవారం, 6 నవంబరు 2023 (09:10 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లికి పరుగుల దాహం తీరడం లేదు. దీంతో తాను ఆడే మ్యాచ్‌లో జట్టు ఏదైనాప్పటికీ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో కోహ్లి ఊహకు మించి రాణిస్తున్నాడు. ఫలితంగా అనేక రికార్డులను తిరగరాస్తున్నాడు. ముఖ్యగా క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. 
 
నిజానికి విరాట్ కోహ్లి గత రెండున్నరేళ్లుగా ఫామ్‌లో లేడు. అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అటు టెస్టులు, వన్డేలు, టీ ట్వంటీ ఇలా మూడు ఫార్మెట్‌లలో కూడా ఆయన ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేక పోయాడు. అందుకే ఈ రెండున్నరేళ్ల కాంలో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేక పోయాడు.  కానీ, ఇపుడు క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులను కొల్లగొడుతున్నాడు. తన సమస్యలను అధికమించిన విరాట్ కోహ్లీ ఈ యేడాది నుంచి అత్యద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ఆసియా కప్‌లో అద్భుత శతకంతో తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకున్నాడు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో ఆకట్టుకుంటూ తన అంతర్జాతీయ పరుగులను 1500 దాటించాడు. 
 
ఇక తాజా ప్రపంచ కప్‌లోనైతే విరాట్ విజృంభణ గురించి ఎంత చెప్పినా తక్కువే. 8 ఇన్నింస్‌లో 108.6 సగటుతో 543 పరుగులు కొల్లగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఆస్ట్రేలియాపై 85, బంగ్లాదేశ్లపై 103 (నాటౌట్), న్యూజిలాండ్‌పై 95, శ్రీలంకపై 88 పరుగులు చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై అజేయ శతకంతో అభిమానులను ఉర్రూతలూ గించిన కోహ్లి... తన పదిహేనేళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్‌గా 79 సెంచరీలు సాధించాడు. ఇందులో వన్డేల్లో 49, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒకటి చేశాడు. ఇప్పుడు వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును అధిగమించేందుకు విరాట్ అడుగు దూరంలో నిలిచాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ ప్రపంచకప్‌లోనే కోహ్లి ఆ అద్భుతాన్ని ఆవిష్కృతం చేసే అవకాశముంది. 
 
కోహ్లి, సచిన్‌లు ఇప్పటివరకు ఏ దేశంపై ఎన్నెన్ని సెంచరీలు చేశాడో ఓసారి పరిశీలిస్తే, ఆస్ట్రేలియాపై 8 (సచిన్ 9), శ్రీలంకపై 10 (8), వెస్టిండీస్‌పై 9 (4), న్యూజిలాండ్‌పై 5 (5), బంగ్లాదేశ్‌పై 5 (1), పాకిస్థాన్‌పై 3 (5), సౌతాఫ్రికాపై 5 (5), ఇంగ్లండ్‌పై 3 (2), జింబాబ్వేపై 1 (5), కెన్యాపై 0 (4), నమీబియాపై 0 (1) చొప్పున వీరిద్దరూ సెంచరీలు చేశారు. 
 
అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొదటి ఐదు మంది క్రికెటర్లను పరిశీలిస్తే, కోహ్లీ 277 ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు చేయగా, సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 49, రోహిత్ శర్మ 251 ఇన్నింగ్స్‌లలో 31, రికీ పాంటింగ్‌ 365 ఇన్నింగ్స్‌లలో 30, సనత్ జయసూర్య 433 ఇన్నింగ్స్‌లలో 28 చొప్పున సెంచరీలు చేసి మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం... బంగ్లా - శ్రీలంక మ్యాచ్ డౌట్?