Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కప్ ఫైనల్ : అమితుమీకి సిద్ధమైన భారత్ - శ్రీలంక

Advertiesment
asia cup final
, ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (13:55 IST)
ఆసియా క్రికెట్ కప్ టోర్నీలో భాగంగా మరికొన్ని నిమిషాల్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలకమైన ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ సర్వసన్నద్ధంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. 
 
ఆసియా కప్ చరిత్రలో అత్యధికంగా ఏడుసార్లు విజేతగా నిలిచిన భారత్ ఎనిమిదో కప్పుపై కన్నేసింది. చివరగా 2018లో ఆసియా కప్ నెగ్గిన భారత్ ఈ ఐదేళ్ల కాలంలో మరే ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు. దాంతో ఈసారి ఎలాగైన ఆసియా కప్ నెగ్గి ప్రపంచ కప్ ముంగిట ఆత్మవిశ్వాసాన్ని కూడబెట్టుకోవాలని భావిస్తుంది. 
 
మరోవైపు టోర్నీ చరిత్రలో ఎక్కువగా 13 సార్లు ఫైనన్‌కు చేరిన శ్రీలంక గతేడాది టీ20 ఫార్మాట్లో విజేతగా నిలిచింది. ఈ జట్టు మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. భారత్ నుంచి అక్షర్, శ్రీలంక నుంచి తీక్షణ గాయం కారణంగా దూరమవుతున్నారు. 
 
మరోవైపు ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ రోజు కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో 90 శాతం వర్ష సూచనతో ఆటకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఇబ్బంది వస్తే రిజర్వ్ డే (సోమవారం) ఉపయోగంలోకి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా కప్ ఫైనల్స్.. శ్రీలంకకు తీక్షణ- భారత్‌కు అక్షర్ పటేల్ దూరం