Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా కప్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ 4 సిక్సర్లు, 4 రికార్డుల మోత

rohit kohli
, సోమవారం, 11 సెప్టెంబరు 2023 (18:23 IST)
16వ ఆసియా కప్ క్రికెట్ సిరీస్‌కు శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 6 జట్లు పాల్గొన్న లీగ్ రౌండ్ ముగిసే సమయానికి భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు సూపర్ 4 రౌండ్‌లోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా నిన్న జరిగిన సూపర్ 4 రౌండ్ 3వ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. 
 
టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ముందుగా బౌలింగ్‌ డిక్లేర్‌ చేయగా, భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ, శుభ్‌మన్  గిల్‌లు చెలరేగారు. ఈ జోడీ 121 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా శుభారంభం చేసింది. 
 
ఇద్దరూ అర్ధశతకాలు సాధించగా, రోహిత్ శర్మ 56 పరుగుల వద్ద, శుభ్‌మన్ గిల్ 58 పరుగుల వద్ద ఔటయ్యారు. వర్షం అంతరాయం కలిగించే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దీంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. 
 
ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. పాక్ పేసర్ షకిన్ అఫ్రిదిపై తొలి ఓవర్‌లోనే సిక్సర్ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 
 
ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు కూడా బాదాడు. తద్వారా 50 ఓవర్ల ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. ఆసియా కప్‌లో జయసూర్య 23 సిక్సర్ల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.
 
అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 3 ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి : 
1. షాహిద్ అఫ్రిది : 26 (21 ఇన్నింగ్స్‌లు) 
2. రోహిత్ శర్మ : 26* (24 ఇన్నింగ్స్‌లు) 
2. సనత్ జయసూర్య : 23 (24 ఇన్నింగ్స్‌లు) 
 
అలాగే టెస్ట్, వన్డే, ట్వంటీ-20 వంటి అన్ని రకాల క్రికెట్‌లతో సహా శ్రీలంకలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన క్రిస్ గేల్ రికార్డును బద్ధలు కొట్టాడు. దీంతో రోహిత్ కొత్త చరిత్ర సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుమ్రా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చిన అఫ్రిది.. వీడియో వైరల్